- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే : కసిరెడ్డి నారాయణరెడ్డి
దిశ,ఆమనగల్లు ::- రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయని, మరో 30 రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చెప్పాడుతుందని, కల్వకుర్తిలో సైతం కాంగ్రెస్ గెలవడం ఖాయమని అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి లో తన 2వ, 3వ సెట్ నామినేషన్ పత్రాలను ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ లతో కలిసి అందచేశారు. అంతకముందు కడ్తాల్ మండలం మైసిగండి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమనగల్లు పట్టణ కేంద్రానికి చేరుకున్నారు.
ఆమనగల్లు పట్టణ కేంద్రం జాతీయ రహదారిపై జెండా ఊపి కల్వకుర్తి బయలుదేరారు.వేల సంఖ్యలో భారీ ఎత్తున నాయకులు,కార్యకర్తలు కల్వకుర్తికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్,ఎంపీపీ అనిత విజయ్, మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి,మండల అధ్యక్షులు జగన్, జిల్లా నాయకులు కృష్ణ నాయక్, నాయకులు అప్పం శ్రీను, గుర్రం కేశవులు,వాటర్ బాబా, బ్రహ్మం, ఎంగళి ప్రసాద్, అలీం, నసీర్ తదితరులు పాల్గొన్నారు.