హిందువులంతా ఏకం కావాలి..శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో అఘోరీ హల్‌చల్...

by Aamani |   ( Updated:2024-11-13 05:09:58.0  )
హిందువులంతా ఏకం కావాలి..శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో అఘోరీ హల్‌చల్...
X

దిశ,శంషాబాద్ : హిందూ దేవాలయాలు, మహిళలపై దాడి చేసిన వారి అంగం కోసి పడేస్తానని అఘోరీ నాగ సాధు హెచ్చరించారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ ఎయిర్పోర్ట్ కాలనీలో ఉన్న హనుమాన్ దేవాలయం ముందు ఉన్న నవగ్రహ విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన విషయాన్ని తెలుసుకుని బుధవారం నవగ్రహ విగ్రహాలను పరిశీలించి, అఘోరీ నాగసాధు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు విపరీతంగా పెరిగాయని అంతేకాకుండా గోహత్యలు, మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని అన్నారు.

ఇవన్నీ చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షలు పడేలా తీసుకురావాలన్నారు. లేదంటే నేనే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వారి అంగం కోసేస్తానన్నారు. హిందూ దేవాలయాలను సందర్శించడానికి వస్తే పోలీసులు నన్ను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. న్యాయం చేసే వారిని అడ్డుకోకుండా దాడులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తే ఇదంతా జరిగేది కాదన్నారు. ఇకనైనా హిందువులంతా ఏకమై హిందూ దేవాలయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన ఆ దేవాలయాలని సందర్శిస్తాను అన్నారు. నన్ను ఎవరైనా అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి అయినా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Next Story