- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దివ్యాంగురాలని కూడా చూడకుండా అలా చేశాడు..
దిశ, శంషాబాద్ : ద్యివ్యాంగురాలిపై కన్నేసి ప్రేమిస్తున్నానని పెళ్ళి చేసుకుని తరువాత మోహం చాటేసిన సంఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్టేషన్ పరిధిలోని సాతంరాయిలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలప్రకారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ సాతంరాయికి చెందిన హరీష చిన్నప్పుడు పోలియో రావడంతో దివ్యంగురాలుగా మారింది.
అయితే ఆమె శంషాబాద్ లోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది. ఆమె ఇంటర్మీడియట్ చదువుతుండగా తన అక్క వాళ్ళ మరిది విష్టు తనతో చనువు ఏర్పర్చుకుని ప్రేమ పేరుతో తన వెంటపడే వాడు. కాలేజీకి సైతం తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళేవాడు. కొన్నాళ్ళు గడిచిన తరువాత తనను మాయమాటలు చెప్పి సాతంరాయిలోని శ్రీరాముని గుడిలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు.
అయితే పెళ్లి చేసుకున్న ఆరు నెలల తరువాత మోహం చాటేసి పోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు. దీంతో హరీష తల్లిదండ్రులు విష్ణుని నిలదీశారు. విషయాన్ని పెద్దల సమక్షంలో మాట్లాడితే అమె దివ్యాంగురాలు తనకు నచ్చడంలేదు అని మోహం చాటేశాడు. అయితే ఈ మద్య విష్ణు మరో అమ్మాయిని వివాహం చేసుకునట్లు తెలిసింది. దీంతో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.