- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్ద అంబర్ పేట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం
దిశ, అబ్దుల్లాపూర్మెట్ : పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్ పర్సన్ పై పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు గత 15 రోజుల క్రితం నుంచి చైర్ పర్సన్ ను దింపాలని మరో వర్గం కౌన్సిలర్లు సంతకాలు సేకరించి జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. సంతకాల సేకరణ వినతిపత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఈనెల 13వ తేదీన అవిశ్వాస తీర్మానం సమావేశం పెట్టేందుకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో 24 వార్డులకు కౌన్సిలర్లు ఉండగా అందులో 17 మంది కౌన్సిలర్లు చైర్పర్సన్ ను దింపాలని నిర్ణయించి సంతకాల సేకరణ చేపట్టారు. మెజార్టీ సభ్యుల నుంచి సంతకాలు రావడంతో జిల్లా కలెక్టర్ ఈ ప్రకటన చేసినట్లు స్థానిక అధికారులు వివరించారు.
మొదటి నుంచి చైర్ పర్సన్ పై కౌన్సిలర్ల విముఖత
బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన పసుమాములకు చెందిన చెవుల స్వప్న గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నేతృత్వంలో చైర్ పర్సన్ గా స్థానిక కౌన్సిలర్లు మద్దతుతో పదవీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు కౌన్సిలర్లు అందరినీ కలుపుకుపోకపోవడం, సొంత పార్టీ కౌన్సిలర్ సైతం విస్మరించి సొంత నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఇతర పార్టీ నేతలతో కుమ్మక్కై పలు లావాదేవీలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. అప్పటినుంచి పార్టీలో ఉన్న కౌన్సిలర్లకు సైతం దూరంగా ఉంటూ చివరికి అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా దూరమయ్యారు. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న చైర్పర్సన్ స్వప్న కు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోపాటు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మద్దతు ఏమాత్రం లేకపోవడంతో ఈ అవిశ్వాసానికి తెరలేపినట్లు సమాచారం.
కాగా మొదటి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డికి విధేయుడుగా ఉంటున్న పండుగల రాజు భార్య జయశ్రీ ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్లుగా కొనసాగుతున్నారు. కౌన్సిలర్ల పదవీకాలం నాలుగో సంవత్సరం పూర్తి కాగానే చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం చేసుకున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలతో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం ఎన్నికలు కూడా అయిపోవడంతో కౌన్సిలర్లలో ఉన్న వ్యతిరేకతను కూడకట్టుకొని పండుగల జయశ్రీ రాజు చైర్ పర్సన్ స్వప్న పై అవిశ్వాసానికి తెరలేపారు. స్థానిక పార్టీ కౌన్సిలర్లతోపాటు ఇతర పార్టీ కౌన్సిలర్ మద్దతు కూడా పెట్టుకున్న జయ శ్రీ రాజు చైర్పర్సన్ సీటు దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు సంతకాలు సేకరించి వినతి పత్రం అందజేశారు. సదరు వివరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఈనెల 13వ తేదీ ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానానికి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో దాదాపు ప్రస్తుత చైర్పర్సన్ స్వప్న చైర్ పర్సన్ పీఠం కోల్పోయి పండుగ జయశ్రీకి దక్కే అవకాశాలు లేకపోలేదు అన్నట్లు స్థానిక కౌన్సిలర్ల మాటలు వింటుంటే ఇట్టే అర్థమవుతుంది.