- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహేశ్వరం గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా..
దిశ, బడంగ్ పేట్ : మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన విషయాన్ని మంత్రి మరిచిపోవద్దని, మహేశ్వరం గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వై.అమరేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డిలు అన్నారు. నాదర్ గూల్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గతంలో ఇచ్చిన 60 గజాల స్థలంలో ఇండ్లు కట్టుకొని వాళ్ళందరూ ఇప్పుడు దర్జాగా ఇండ్లు కట్టుకోవాలని, ఎవరైనా అధికారులు అడ్డుకుంటే ప్రాణత్యాగాలకు వెనకాడమని అన్నారు.
ఆదివారం బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్ గూల్ లోని తోట జంగారెడ్డి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ నాయకులు బంగారి బాబు, సుభాన్ యాదవ్ నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీకార్యకర్తల సమావేశానికి వారు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదన్నారు. 58, 59 జీవో కింద కేవలం 7, 8 పట్టాలు ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బంగారు బాబు, ఏనుగు జంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, బడంగ్ పేట్ కార్పొరేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు అమృత నాయుడు, కే.శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.