- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్డీ ఇన్‌ఫ్రాకు 70 ఎకరాలు!
దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లాలో ఆదిభట్ల, తుర్కయంజాల్, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని భూములు కొనేందుకు రియల్ వ్యాపారులు తహతహలాడుతున్నారు. కలెక్టరేట్ భవనం నిర్మిస్తారనే ప్రచారంతో అనేక మంది రియల్ వ్యాపారులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములపై కన్నేశారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే నలుగురు నాయకులు రెవెన్యూ అధికారులతో రాయబారం నడుపుతూ భూములకు క్లియరెన్స్ ఇప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కోర్టు ఆర్డర్, ఓఆర్సీ, ఎన్వోసీల సహాయంతో భూములను పట్టాలుగా మార్చేసుకుంటున్నారు. అయితే ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ లో గల 249 సర్వే నెంబర్ లో 70 ఎకరాలకు ఎన్డీ ఇన్ ఫ్రా సంస్థకు చెందిన ప్రతినిధులు, బినామీల పేరిట పట్టా జారీ చేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోట్లు విలువైన భూమి ప్రైవేటు కంపెనీకి..
కొంగరకలాన్ లోని 249 సర్వే నెంబర్ లో 1026 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. అయితే దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 110 ఎకరాలను సాగు కోసం పంపిణీ చేశారు. అప్పటి నుంచి అసైన్డ్ ల్యాండ్ గా ఉన్నది. ప్రస్తుతం అక్కడి భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పెద్దలు, నాయకులు తమ అధికార బలాన్ని ఉపయోగించి, రైతులకు నగదు ఆశ చూపించి ఆ భూములను లాగేసుకుంటున్నారు. ఎకరాకు రూ. 80 లక్షల చొప్పున చెల్లిస్తామని రైతులతో బేరం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఏదైనా భూ సమస్య ఉంటే తామే చూసుకుంటామని వారితో చెప్పారు. 2019లో ఈ ఫైల్ ను కదిలించారు. 70 ఎకరాలకు పెండింగ్ డాక్యుమెంట్ చేసుకొని భూ మార్పిడికి ప్రయత్నాలు చేశారు.
ఒకే సర్వేనెంబర్ భూ స్వభావంలో మార్పులేల?
ధరణి వచ్చిన తర్వాత భూ ప్రక్షాళన పూర్తి స్థాయిలో చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అదే ఉద్దేశ్యంతో రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారని అనుకుంటున్నారు.. కానీ కొన్ని సర్వే నెంబర్లు పరిశీలించినప్పుడు తేడాలు ఎందుకున్నాయని పలువురికి అనుమానాలు వస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని 249 సర్వే నెంబర్ 1960–61 నుంచి 1964–65 వరకు సర్కారీగా, 1965–66 నుంచి 1980–81 వరకు ఖుష్కీగా, 1985–86 నుంచి 249, 249/1 సర్వేనెంబర్ తప్ప 249/2 నుంచి 249/17 వరకు ఉన్న సర్వేనెంబర్ పట్టాగా పహాణీలల్లో మార్పిడి చెందడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 249 సర్వే నెంబర్ పై అటవీ భూమి అని ఉండగా, 249/1 నుంచి 241/17 వరకు అన్ని సబ్ డివిజన్ సర్వే నెంబర్లు స్థానిక రైతులకు అసైన్డ్ భూమిగా కేటాయించారు. కానీ కేవలం 249/2 నుంచి 249/17 వరకు సర్వే నెంబర్లలో ఉన్న రైతుల భూమి పట్టాగా మారడం, 249/1 సర్వే నెంబర్లలోని భూమి అసైన్డ్ భూమిగానే రికార్డులో ఉండడం గమనార్హం. అయితే 249 సర్వే నెంబర్లోని భూమి మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ గానే తెలుస్తున్నది. అయితే సాగుకు యోగ్యమైన భూమి రైతులకు పంపిణీ చేయడంతో అసైన్డ్ భూమిగా మారిపోయింది.
ఐఆర్ఎస్, ఐఏఎస్ ఆఫీసర్ల ప్రమేయం
అసైన్డ్ భూమిని పట్టా గా మార్చడంలో ఢిల్లీలో పనిచేసే ఓ ఐఆర్ఎస్, రాష్ట్రంలో పనిచేసే ఐఏఎస్ అధికారులు కలిసి పక్కా పథకం ప్రకారం ముందుకు సాగినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా 249 సర్వే నెంబర్ హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ లో ఫారెస్ట్ జోన్ గా ఉంటే ఇటీవల కాలంలోనే రెసిడెన్షియల్ జోన్ గా మరూస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టా భూమి ఉంటే ఆ ప్రాంతం అగ్రికల్చర్ జోన్‌గా ఉండాలి. కానీ ఫారెస్ట్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ గా మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ జోన్ మార్పిడిలో ఓ మంత్రి హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎన్డీ ఇన్ ఫ్రా కు చెందిన దీపక్ రెడ్డికి, కరుణాకర్ ల కోసం అధికారులు 70 ఎకరాల అసైన్డ్ భూమికి పట్టా జారీ చేశారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో ఏ ఫైల్ నైనా క్లియర్ చేసే దళారీగా వ్యవహరించే చోడా హరికిషన్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తున్నది.