- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటు వేయడానికి హైదరాబాద్ కు చేరుకున్న రకుల్ ప్రీత్ సింగ్!
దిశ, డైనమిక్ బ్యూరో: స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ డమ్ అందుకున్న రకుల్ ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస ఛాన్సులు అందుకుంది. ఇక టాలీవుడ్ కు దూరమైనా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తోంది. తాజాగా ఆమె హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఎన్నికలకు ముందు రోజు నగరానికి చేరుకోవడంతో ఆమె రేపు ఓటు హక్కు వినియోగించుకోపోతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కు గతంలో హైదరాబాద్ లోనే ఓటు హక్కు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె రాకతో ఈ చర్చ జరుగుతోంది.
కాగా సినిమాల్లో నటిస్తూనే రకుల్ ప్రీత్ సింగ్ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఆమెకు ఇప్పటికే హైదరాబాద్ లో ఎఫ్ 45 పేరుతో జిమ్ ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది స్టార్ ఈ జిమ్ లోనే కసరత్తులు చేస్తుంటారు. ఇదే కాకుండా.. వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్నెస్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ స్కిన్, న్యూబూ వంటి సంస్థల్లో కూడా ఆమె పార్ట్నర్ గా కూడా ఉన్నారు. గత ఏప్రిల్ లోనే హైదరాబాద్ లోని మాదాపూర్ లో ‘ఆరంభం’ అనే పేరుతో చిరుధాన్యాల (మిల్లెట్స్) రెస్టారెంట్ బిజినెస్ ను సైతం ప్రారంభించిన సంగతి తెలిసిందే.