- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నైతికంగా విజయం నాదే’.. MLC బై పోల్‌లో ఓటమిపై రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. గత రెండు రోజులుగా సాగుతోన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఎట్టకేలకు శుక్రవారం రాత్రి ముగిసింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మల్లన్నకు చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఓటమి అనంతరం రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటమిని అంగీకరిస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికలో సాంకేతికంగా ఓడిపోవచ్చు కానీ నైతికంగా గెలిచానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుండి బరిలోకి దిగారు. బీజేపీ తరుఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలోకి దిగగా, అశోక్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అశోక్ సార్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. గత నెల 27న ఈ ఎన్నిక జరగగా.. తాజాగా దీనికి సంబంధించిన ఫలితం వెలువడింది. తీవ్ర ఉత్కంఠలో చివరికి కాంగ్రెస్ క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించారు.