పల్లా రాజేశ్వర్ రెడ్డికి రాజయ్య షాక్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-23 09:43:33.0  )
పల్లా రాజేశ్వర్ రెడ్డికి రాజయ్య షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌లో సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించడంతో పలువురు ఎమ్మెల్యేలు అధిష్టానంపై సీరియస్ గా ఉన్నారు. మరికొంత మంది స్పష్టమైన హామీ రావడంతో సైలెంట్ అయ్యారు. కాగా తాజాగా రాజయ్యను కలిసేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి యత్నించారు. రాజయ్య ఇంట్లో లేకపోవడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి వెనుతిరిగి వెళ్లిపోయారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలవడానికి ఎమ్మెల్యే రాజయ్య నిరాకరించినట్లు తెలిసింది. దీంతో పల్లా ఎమ్మెల్యే రాజయ్య అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. రాజయ్యకు అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. రెండు మూడు రోజుల్లోనే సీఎం కేసీఆర్ ను తాము కలుస్తామన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు. రాజయ్య, కడియం, తాను కలిసి గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed