కడియం శ్రీహరికి మద్దతుగా ప్రచారంలో రాజయ్య అదిరిపోయే స్టెప్పులు (వీడియో)

by Rajesh |
కడియం శ్రీహరికి మద్దతుగా ప్రచారంలో రాజయ్య అదిరిపోయే స్టెప్పులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధిష్టానం ఈ సారి ఎమ్మెల్యే రాజయ్యను కాదని స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరిని బరిలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తీవ్ర ఆందోళన చెందిన రాజయ్య ఒక సందర్భంలో కన్నీటి పర్యంతమయ్యారు. కాగా రాజయ్యకు సీఎం కేసీఆర్ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడి పదవిని కట్టబెట్టారు. ఈ పదవిలో రాజయ్య రెండేళ్లు కొనసాగనున్నారు. ఇక, స్టేషన్ ఘన్ పూర్‌లో కడియం శ్రీహరిని గెలిపించాలని రాజయ్య ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు.

తాజాగా శనివారం రాజయ్యకు మద్దతుగా డబ్బులు వాయిస్తూ, కోలాటం ఆడుతూ డ్యాన్సులు చేస్తూ రాజయ్య ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అభ్యర్థుల ఎంపిక నాటికి నువ్వా.. నేనా అన్నట్లు తలపడిన రాజయ్య, కడియం కలిసిపోవడం.. తాజాగా రాజయ్య శ్రీహరికి మద్దతుగా ప్రచారం చేయడం, డ్యాన్సులు చేసి సందడి చేయడంతో స్థానికంగా ఈ అంశం గురించి అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.



Next Story