కడియం నరరూప రాక్షసుడు.. రాజయ్య సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-30 16:04:04.0  )
కడియం నరరూప రాక్షసుడు.. రాజయ్య సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ కార్యక్రమంలో రాజయ్య మాట్లాడారు. కడియం శ్రీహరి నరరూప రాక్షసుడిగా రాజయ్య అభివర్ణించారు. నమ్మకద్రోహి అయిన కడియంను మేధావి అన్న వాళ్లే ప్రస్తుతం చెంపలేసుకుంటున్నారన్నారు. తనలాంటి అమాయకుడిపై అక్రమ కేసులు బనాయించారని రాజయ్య ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి అవినీతి సామ్రాట్ అని.. కడియం శ్రీహరిపై మాదిగ జాతి తూ.. అని ఊస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేనిలో కడియం గొప్ప అని.. కబడ్డీ ఆడదామా.. డప్పు కొడదామా.. టైం డేట్ ఫిక్స్ చేస్తే ఎక్కడైనా తాను రెడీ అని కడియంకి రాజయ్య సవాల్ విసిరారు. కడియం 4వేల మెజార్టీతో గెలిస్తే తాను 12 వేలు, 33 వేలు, 58 వేల మెజార్టీతో తాను గెలిచానన్నారు.

Advertisement

Next Story