- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మునుగోడుతో పాటు ఆ సీటు నుంచి కూడా పోటీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడీ
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయగా.. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారు. ఇందుకు గాను రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా.. ఇవాళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మునుగోడు నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఈ విషయాన్ని అధిష్టానంకు చెప్పినట్లు తెలిపారు. పార్టీ ఆదేశిస్తే గజ్వేల్ లేదా కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కేసీ వేణుగోపాల్‌తో కూడా ఈ విషయంపై చర్చించినట్లు తెలిపారు. రేపు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో తిరిగి చేరనున్నట్లు చెప్పారు.
మునుగోడుతో పాటు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేసేందుకు రాజగోపాల్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గజ్వేల్ నుంచి రేవంత్ రెడ్డిని బరిలోకి దింపాలనే యోచనలో అధిష్టానం ఉంది. ఇక సిరిసిల్ల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిద్దిపేట నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీలోకి దిగనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.