- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ను స్వాగతిస్తున్నాం.. ఆయన శాసన సభ్యత్వం రద్దు చేయాలి..'
దిశ, తెలంగాణ బ్యూరో : మహమ్మద్ ప్రవక్తపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ రాజాసింగ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఓ మత బోధకుడిపై కించపరిచే వ్యాఖ్యలు చేసి తేలిగ్గా పారిపోవాలని ప్రయత్నించడం దారుణమని, ఇది ఏ నాగరిక సమాజంలోనూ, ఏ ఆధునిక దేశంలోనూ, 21వ శతాబ్దపు భారతదేశంలోనూ ఆమోదయోగ్యం కాదని ఉత్తమ్ ఆరోపించారు.
రాజా సింగ్‌కు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని, ఆయన చాలాకాలం క్రితమే పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి ఉండాల్సిందని, మతపరమైన, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఉండాల్సిందన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యుత్తమంగా చెప్పుకుంటున్నారని, ప్రతిపక్ష నేతల కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి అన్ని వనరులను ఉపయోగిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే అప్‌లోడ్ చేసి ప్రచారం చేసిన రెచ్చగొట్టే వీడియోను వారు గమనించలేకపోయారని, వివాదాస్పద వీడియోను అప్‌లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే రాజా సింగ్‌పై సూమోటో కేసును బుక్ చేయాల్సి ఉందన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు చెలరేగిన తర్వాతే హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారని, అంతేకాకుండా బలహీనమైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, అరెస్టులో తగిన విధానాలు పాటించలేదన్నారు. ఇక పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన పలు షాకింగ్ వీడియోలు బుధవారం నుంచి ప్రచారంలో ఉన్నాయని, గణేష్ ఉత్సవాల ప్రారంభానికి ముందు ఈ పరిణామాలు పండుగలకు మంచి సంకేతం కాదని, టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు సామాన్యులను మతతత్వ మంటల్లోకి నెట్టి వారి జీవితాలతో ఆడుకోవడం మానేయాలని ఉత్తమ్ సూచించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమం శూన్యం : మంత్రి హరీష్ రావు