- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘రైతు భరోసా’ సాయం అందని వారికి తీపి కబురు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ (Congress Government) వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 26 తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో రైతు భరోసా (Raithu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Aathmiya Bharosa), కొత్త రేషన్ కార్డులు (New Ration Cards), ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses) పథకాలకు శ్రీకారం చుట్టింది. ఒక్కో మండల పరిధిలో ఒక్కో గ్రామంలో నాలుగు పథకాలకు గాను లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ప్రభుత్వ సాయం అందజేశారు. అయితే, ‘రైతు భరోసా’ (Raithu Bharosa) పథకానికి సంబంధించి ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం 32 జిల్లాల్లో 563 మండలాలకు చెందిన 577 గ్రామాల్లోని 4,41,911 మంది రైతులకు సంబంధించి 9,48,333 ఎకరాల భూమికి, వారి ఖాతాల్లో ప్రభుత్వం రూ.569 కోట్లు జమ చేసింది. అయితే, మిగతా గ్రామాల్లో తమకు ‘రైతు భరోసా’ సాయం అందలేదని చాలా మంది అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Agriculture Minister Thummala Nageshwar Rao) ‘రైతు భరోసా’ సాయం అందని రైతులను ఉద్దేశించి ఓ కీలక ప్రకటన చేశారు. రాబోయే మార్చి 31లోగా రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం రూ.54,280 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్‌లో రూ.72 వేల కోట్ల నిధులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే కేటాయించామని గుర్తు చేశారు. రైతులకు విద్యాత్ సరఫరాలో ఎలాంటి ఇంబ్బందులు, ఆటంకాలు కలుగకుండా చూడాలని సంబంధించి అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.