తెలంగాణలో ఐదు రోజులు గట్టి వానలే!

by Ramesh N |
తెలంగాణలో ఐదు రోజులు గట్టి వానలే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో పలు చోట్ల వాన దంచి కొడుతోంది. నగరంలోని ఉప్పల్, రామంతపూర్, చిలుక నగర్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో అక్కడకక్కడా ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రేపు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. మే 30వ తేదీన కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలో జూన్‌ ఐదు, ఆరో తేదీల్లో విస్తరించనున్నాయి. రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story