తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్..

by Mahesh |
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో 13 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ వర్షాలు విస్తారంగా కురుస్తాయని.. ముఖ్యంగా విజయనగరం, అల్లూరి, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, తూర్పు గోదావరి, తిరుపతిలో వర్షాలు కురవనున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed