బిగ్ అలర్ట్ : రేపు ఎల్లుండి వడగళ్ల వర్షం పడే అవకాశం

by samatah |
బిగ్ అలర్ట్ : రేపు ఎల్లుండి వడగళ్ల వర్షం పడే అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్ : రైతులకు వాతావరణశాఖ,మరోసారి కీలక హెచ్చరికలు జారీచేసింది. ఇప్పటికే వడగళ్ల వర్షాలతో రైతులు నష్టాల్లో కూరుకపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ తెలిపింది.శుక్ర, శనివారాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఇప్పటికే భారీ పటనష్టంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చేతికంద వచ్చిన పంట వర్షానికి నేలకు వాలిపోవడంతో రైతన్నల కంట కన్నీరే మిగిలింది.

Advertisement

Next Story