- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Railway News: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో జూన్ 30 వరకు రైళ్లు రద్దు!
దిశ, వెబ్‌డెస్క్: మూడో లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున మే 27 నుంచి జూన్ 30 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మేరకు 07462/63 వరంగల్-సికింద్రాబాద్ పుష్ పుల్ రైలు, 17035/36 కాజీపేట-బల్లార్షా, 07766/65 కరీంనగర్-సిర్పూర్ టౌన్, 07894 కరీంగనర్-బోధన్ రైలు జూన్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా ఏపీలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో గల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు.
07977/07978 నెంబర్‌గల విజయవాడ-బిట్రగుంట మధ్య నడిచే ట్రైన్స్ మే 27 నుంచి జూన్ 23 వరకు రద్దు చేశారు. వీటితోపాటు మే 27 నుంచి 31 వరకు, జూన్ 3 నుంచి 7 వరకు, జూన్ 10 నుంచి 14 వరకు.. జూన్ 17 నుంచి జూన్ 21 వరకు 17237/17238 అనే నెంబర్ గల బిట్రగుంట-చెన్నై సెంట్రల్ ట్రైన్స్ రద్దయినట్లు తెలిపారు. గుంటూరు-రాయగడ 17243/17244 ట్రైన్స్ కూడా మే 27 నుంచి జూన్ 24 వరకు రద్దయ్యాయి. కాకినాడ పోర్ట్- విశాఖపట్నం మధ్య నడిచే 17267/17268 ట్రైన్స్ కూడా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.