- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DJ Tillu : మాట మీద నిలబడే మనిషివి కాదు రాహుల్ నువ్వు.. డీజే టిల్లు డైలాగ్ బీజేపీ సెటైర్లు
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తెలంగాణ బీజేపీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్ చేసింది. తెలంగాణలో జర్నలిస్టుల పై దాడులు జరుగుతున్నాయని సోమవారం ఢిల్లీలో తెలంగాణ స్వతంత్ర జర్నలిస్టులు విజ్ఞాపన పత్రం ఇద్దామని రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు. వారిని లోనికి అనుమతి లేకపోవడంతో ఇంటి గేటు ముందు నిరసన తెలియజేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చి వీధుల్లో ప్రేమను పంచుతా అన్నారు.. కానీ పరిస్థితులు అలా లేవని ఆ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన తెలంగాణ బీజేపీ రాహుల్ గతంలో మాట్లాడిన వీడియోను జోడించి తన అధికారిక ఖాతా ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ‘ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. ఢిల్లీలో మీ సేవకుడున్నాడు. మీకేం అవసరం వచ్చినా.. నా ఇంటి తలుపులు మీ కోసం తెరిచి ఉంటాయని గుర్తుపెట్టుకోండి’ అని వీడియోలో రాహుల్ చెప్పారు. తర్వాత ఇవాళ తెలంగాణ జర్నలిస్ట్‌లను రాహుల్ కలవలేదని బీజేపీ ఆరోపణలు చేస్తూ.. ఆ షేర్ చేసిన వీడియోకు జర్నలిస్ట్‌లది జత చేసింది. ఈ క్రమంలోనే తెలుగు ఫేమస్ మూవీ డీజే టిట్లు డైలాగ్‌ను సెటైరికల్‌గా జత చేసి రాహుల్ గాంధీకి ట్యాగ్ చేసింది.