- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్‌కు కోర్టులపై గౌరవం లేదు : బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కోర్టులపై గౌరవం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ విమర్శలు చేశారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓబీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. తేలీ కులస్తులను దొంగలని రాహుల్ మాట్లాడటం వారిని అవమానపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్‌కు ప్రతిపక్షాలు వంత పాడటం మానుకోవాలని బండి సూచించారు. పేదలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసే పార్టీలకు బీసీలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఇక సిట్ అంశాన్ని లీగల్‌గా డీల్ చేయనున్నట్లు బండి సంజయ్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి రైతులకు ఇస్తున్న ఎస్‌డీఆర్ఎఫ్ నష్టపరిహారం నిధుల్లో 75 శాతం కేంద్రానివే అని చురకలంటించారు. తొమ్మిదేండ్లుగా కేసీఆర్ రైతులకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాజరిక వ్యవస్థలోనే కొనసాగుతోందని చురకలంటించారు.