గద్దర్ మరణంపై రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్

by Satheesh |   ( Updated:2023-08-06 12:10:30.0  )
గద్దర్ మరణంపై రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణవార్త యావత్ తెలంగాణను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్త తెలుసుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ మరణంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా గద్దర్ మరణంపై రాహుల్ సంతాం తెలిపారు. ‘‘తెలంగాణ దిగ్గజ కవి, ఉద్యమకారుడు గుమ్మడి విఠల్ రావు మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. తెలంగాణ ప్రజలపై ఆయనకున్న ప్రేమ అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసేందుకు ఆయనను పురికొల్పింది.

గద్దర్ వారసత్వం మనందరికి స్ఫూర్తిదాయకంగా కొనసాగాలి’’ అని రాహుల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. కాగా, గాంధీ కుటుంబంపై ప్రత్యేక అభిమానం కలిగిన గద్దర్.. ఇటీవల రాహుల్ గాంధీ ఖమ్మం సభకు వచ్చిన క్రమంలో వెళ్లి ప్రత్యేకంగా కలిశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీని ఎంతో అప్యాయంగా కౌగిలించుకుని మరోసారి గద్దర్ అతడిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. గతంలో కూడా ఓ సారి ప్రేమతో రాహుల్ గాంధీకి గద్దర్ ముద్దుపెట్టాడు.

Read More..

గద్దర్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నా: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి

Advertisement

Next Story