Rahul Gandhi: తెలుగు రాష్ట్రాల్లో వరదలపై స్పందించిన ఏఐసీసీ అగ్రనేత

by Ramesh Goud |   ( Updated:2024-09-02 15:19:57.0  )
Rahul Gandhi: తెలుగు రాష్ట్రాల్లో వరదలపై స్పందించిన ఏఐసీసీ అగ్రనేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరదలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఈ వరదల్లో వాగులు, వంకలు ఉప్పొంగి, చాలా చోట్ల బ్రిడ్జిలు సైతం కొట్టుకొని పోయాయి. దీంతో ఆయా జిల్లాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదలు కారణంగా చాలా మంది నీటిలో కొట్టుకుపోయారు.

దీనిపై రాహుల్ గాంధీ.. ఎడతెగని వర్షాలు, వినాశకరమైన వరదలను భరిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో నా ఆలోచనలు ఉన్నాయని అన్నారు. ఈ వరద ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వరద ప్రభావ ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, సహాయక చర్యలకు మద్దతుగా అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కోరారు. ఇక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని తెలిపారు. ఈ విపత్తులో నష్టపోయిన వారందరికీ సమగ్ర పునరావాస ప్యాకేజీలను త్వరగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాహాల్ గాంధీ కోరారు.

Advertisement

Next Story

Most Viewed