- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేపటి నుంచి తెలంగాణలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ షూరూ చేస్తోంది. అందులో భాగంగా రేపటి నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
మూడు రోజుల పాటు రాష్ట్రంలో రాహుల్ బస్సు యాత్రలో పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా రైతులు, మహిళలతో రాహుల్ సమావేశమవుతారు. అలాగే పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 18న ములుగు, భూపాలపల్లిలో రాహుల్ పర్యటన ఉండనుండగా.. ఆ రోజున ములుగులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 19న కరీంనగర్ జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఆ రోజున భూపాలపల్లిలో బహిరంగ సభ ఉండనుంది.
20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ బస్సు యాత్రను కొనసాగించనున్నారు. ఆ రోజున ఆర్మూరులో పసుపు రైతులతో భేటీ కావడంతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. అటు దసరా తర్వాత రెండో విడత బస్సు యాత్ర ఉండనుండగా.. ఇందులో ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడో విడత బస్సు యాత్ర ఉండనుండగా.. ఈ యాత్రలో సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యే అవకాశముంది.