Rachakonda police: న్యూ ఇయర్ వేడుకల వేళ రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు

by Prasad Jukanti |
Rachakonda police: న్యూ ఇయర్ వేడుకల వేళ రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూర్యో: న్యూ ఇయర్ కు (New Year Celebrations in hyd) ఘనంగా స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు రాచకొండ పోలీసులు (Rachakonda Police) ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. రోడ్డు వినియోగదారుల భద్రతా దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి 1 జనవరి 2025 తెల్లవారుజామున 5 గంటల వరకు ఓఆర్ఆర్ పై కార్లు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మీడియం, హెవీ గూడ్స్ వాహనాలకు యధావిధిగా అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే ప్రయాణ టికెట్లు చూపిస్తే విమానాశ్రయానికి వెళ్లాల్సిన కార్లును అనుమతిస్తామని తెలిపారు. నాగోల్ ప్లై ఓవర్, కామినేని ప్లై ఓవర్, ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్డులో మల్టీ లెవల్ ప్లైఓవర్, బైరామల్ గూడ ఎక్స్ రోడ్ (సాగర్ రింగ్ రోడ్డు), ఎల్బీనగర్ అండర్ పాస్, చింతల కుంట అండర్ పాస్ లోని మొదటి, రెండో లెవల్ ప్లై ఓవర్లపై లైట్ మోటార్, టూవీలర్, ప్యాసింజర్ వాహనాలను అనుమతి ఇవ్వబోమని తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి 1 జనవరి 2025 తెల్లవారుజాము 5 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే మీడియం, హెవీ గూడ్స్ వాహనాలను అనుమతి ఇస్తామని తెలిపారు. ఈ ఆంక్షల నేపథ్యంలో తదనుగుణంగా ప్రజలు తమ ప్రయాణాలు పెట్టుకుని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు సూచన:

క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు, ఆపరేటర్లు సరైన యూనిఫామ్ ధరించాలని సూచించారు. అలాగే అన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎవరినీ అద్దెపై ప్రయాణించడాన్ని నిరాకరించకూడదని ఇలా చేస్తే మోటార్ వెహికల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఎవరైనా అద్దెపై ప్రయాణాన్ని నిరాకరిస్తే అలాంటి వారిపై వాహనం వివరాలు, టైమ్, ప్లేస్ వంటి వివరాలతో 8712662111 నెంబర్ కు వాట్సాప్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అధిక చార్జీల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని హెచ్చరించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు:

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని రహదారుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు (Drunk and drive) నిర్వహించనున్నారు. వాహనాలకు సంబంధించి సరైన డాక్యుమెంట్లు చూపకుంటే తాత్కాలికంగా వాహనాలను కస్టడీలోకి తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఏదైనా ఆటంకం కలిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు మైనర్లు వాహనాలు నడిపేతే వాహనంతో పాటు డ్రైవర్ ను న్యాయస్థానంలో ప్రాసిక్యూట్ చేస్తామన్నారు. మితిమీరిన శబ్ధాలు కలగజేసే మాడిఫైడ్ సైలెన్సర్లు, హారన్స్ , మ్యూజిక్ సిస్టమ్స్ కలిగి ఉంటే వాహనం యజమానితో పాటు వాహనాన్ని ప్రాసిక్యూట్ చేస్తామన్నారు. డ్రంగ్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed