- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీవర్క్స్‌తో క్వాల్ కామ్ ఇండియా ఒప్పందం
దిశ, తెలంగాణ బ్యూరో: టీవర్క్స్‌తో క్వాల్ కామ్ ఇండియా శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే అతిపెద్ద ప్రొటో టైపింగ్ కేంద్రం క్వాల్ కామ్ సంస్థతో మల్టీలేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ఫ్యాబ్రికేషన్ సదుపాయాన్ని నెలకొల్పనుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల నమూనా ఆవిష్కరణ, అభివృద్ధిని మరింత వేగవంతం చేయనుంది. డిజైన్, ఇన్నోవేషన్‌ను ప్రారంభించడం, మద్దతు ఇవ్వడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా క్వాల్‌కామ్ ద్వారా నడిచే అనేక కార్యక్రమాలతో సమన్వయం చేయనున్నారు.
ఈ సందర్భంగా టీ-వర్క్స్ సీఈవో సుజయ్ కరంపురి మాట్లాడుతూ.. దేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీకి ఇష్టపడే గమ్యస్థానంగా టీవర్క్స్‌ను మారుస్తున్నామన్నారు. దేశం నుంచి గ్లోబల్ బ్రాండ్‌ల ఎగుమతికి క్వాల్ కామ్ ఇండియా సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శశి రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.