పువ్వాడ వర్సెస్ పొంగులేటి..ఖమ్మం రాజకీయం నాదా ? నీదా..?

by Seetharam |
పువ్వాడ వర్సెస్ పొంగులేటి..ఖమ్మం రాజకీయం నాదా ? నీదా..?
X

దిశ,వెబ్‌డెస్క్: ఖమ్మం రాజకీయం కాకరేపుతోంది. బీఆర్ఎస్ నాయకులకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పార్టీ రాజకీయం కంటే పువ్వాడ వర్సెస్ పొంగులేటిల మధ్య టాపిక్ డైవర్టవుతోంది. పొంగులేటి టార్గెట్‌గా బీఆర్ఎస్ నేతలు వార్నింగ్‌లు ఇస్తుండటంతో ఖమ్మం రాజకీయాలు కాకరేపుతున్నాయి.కొద్ది రోజులుగా పొంగులేటి టార్గెట్‌గా కారు పార్టీ నేతలు స్పీడు పెంచారు. బీఆర్ఎస్‌కు ప్రతిపక్షాల కంటే పొంగులేటే టార్గెట్‌ అయ్యారు.

పొంగులేటి స్పీడ్‌ పెంచేకొద్దీ.. బీఆర్ఎస్‌ నేతలు మాటలు తూటాలవుతున్నాయి. దీంతో పొంగులేటి వర్గానికి.. బీఆర్ఎస్‌ నేతలకు మధ్య వార్‌ నడుస్తోంది. పొంగులేటి కొద్దిరోజులుగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పొంగులేటిపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తే చాలు పొంగులేటిపై పువ్వాడ అజయ్ కుమార్ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానిక ఇద్దరు బలమైన నేతల మధ్య ఖమ్మం రాజకీయం నీదా ..? నాదా..? అన్నట్లు పోటాపోటీగా పరిస్థితులు మారాయి. దీంతో ఖమ్మం పాలిటిక్స్‌ తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story