Harish Rao: బతుకమ్మను పక్కకు పెట్టు సోనియమ్మకు జై కొట్టు.. హరీశ్ రావు సెటైర్లు

by Ramesh N |
Harish Rao: బతుకమ్మను పక్కకు పెట్టు సోనియమ్మకు జై కొట్టు.. హరీశ్ రావు సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ తల్లి (Telangana Talli) నూతన విగ్రహ రూపంపై బీఆర్ఎస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ తల్లి చేతిలో (Bathukamma) బతుకమ్మను పెట్టలేదని, కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం గుర్తు పెట్టారని బీఆర్ఎస్ (BRS) నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఎక్స్ వేదికగా ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ గాంధీ బతుకమ్మను ఎత్తిన ఫోటోలను పంచుకున్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ గతంలో చేసిన బతుకమ్మ ఫోటోల ట్వీట్‌ను హరీశ్ రావు రీ ట్వీట్ చేశారు.

‘ఎన్నికల ముందు జై బతుకమ్మ- ఎన్నికలైనంక నై బతుకమ్మ? బతుకమ్మను పక్కకు పెట్టు సోనియమ్మ కు జై కొట్టు.. ఇది కదా అసలు సిసలైన మార్పు’ అంటూ సీఎంకు ఫోటోలు ట్యాగ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed