- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రీతిని వేధించిన వ్యక్తిని కఠినంగా శిక్షించండి: దళిత, గిరిజన సంఘాల ధర్నా
దిశ, ఖైరతాబాద్: వరంగల్ కేయూ మెడికల్ పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ ప్రీతిని వేధించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని దళిత, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తూ నిమ్స్ ఆసుపత్రిలో ధర్నాకు దిగాయి. వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న డాక్టర్ ప్రీతి హెల్త్ బులెటిన్ ను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతిని పరామర్శించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రీతి సంఘటనపై పలు అనుమానాలు ఉన్నందున న్యాయ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని, కేయూ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ హెచ్ఓడీని సస్పెండ్ చేయాలన్నారు. వరంగల్ లో ప్రీతికి జరగాల్సిన న్యాయ పోరాటంలో పాల్గొన్న డీడీఎఫ్ నేత చుంచు రాజేందర్, వివిధ సంఘాల నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ ధర్నాలో బీఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు అంసొల్ లక్ష్మణ్, వలిగి ప్రభాకర్, పులి కల్పన, నరేందర్ పవార్, మాలి, శ్రీను, బంజారా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.