నేటి నుంచి ‘రైతుభరోసా’పై ప్రజాభిప్రాయ సేకరణ షురూ..

by Shiva |
నేటి నుంచి ‘రైతుభరోసా’పై ప్రజాభిప్రాయ సేకరణ షురూ..
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేటి నుంచి ఈ నెల 23 వరకు రైతుభరోసా స్కీమ్‌పై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయనుంది. అందులో భాగంగా బుధవారం ఖమ్మంలో మంత్రుల కమిటీ పర్యటించి రైతులు, రైతు సంఘాలు, సాధారణ ప్రజలు, స్థానిక రాజకీయ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనుంది. ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసా స్కీమ్‌ను అమలు చేయాలి? అందిరికీ వర్తింపజేయాలా? ఏమైనా కండీషన్లు పెట్టాలా? అనే అంశాలపై అభిప్రాయాలు సేకరించనుంది. తొలి జిల్లా పర్యటనలో కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను ప్రభుత్వం అందించే ఫార్మాట్‌లో అందించాల్సి ఉంటుంది. సంబంధిత ఫార్మాట్ పేపర్లను అన్ని జిల్లాలకు ప్రభుత్వం పంపించింది. జిల్లాల్లో పర్యటనలో సేకరించిన అభిప్రాయాలను సబ్ కమిటీ ముందుగా స్క్రూటినీ చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని భావిస్తున్నది.

ఇప్పటివరకు ఖరారైన సబ్ కమిటీ పర్యటన షెడ్యూలు

తేదీ పర్యటించే జిల్లా

10–07–24 ఖమ్మం

11–04–24 అదిలాబాద్

12–07–24 వరంగల్

15–07–24 మహబూబ్ నగర్

16–07–24 (సంగారెడ్డి) మెదక్

18–07–24 నిజామాబాద్

19–07–24 నల్లగొండ

23–07–24 రంగారెడ్డి

Advertisement

Next Story

Most Viewed