మంత్రి సీతక్క పర్యటనలో ప్రొటోకాల్ వివాదం

by Rajesh |   ( Updated:2024-07-01 08:23:54.0  )
మంత్రి సీతక్క పర్యటనలో ప్రొటోకాల్ వివాదం
X

దిశ, వెబ్‌డెస్క్: కొమురం జిల్లాలో మంత్రి సీతక్క పర్యటనలో ప్రొటోకాల్ వివాదం కలకలం రేపింది. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ కలెక్టరేట్ దగ్గర ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఆందోళనకు దిగారు. వివాదంపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు. కలెక్టర్ బయటకు రావాలని బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే రెబ్బన మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ పర్యటనలో మంత్రి ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే కోవాలక్ష్మీ, బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే కలెక్టర్ బయటకు రాలేదని ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. కలెక్టర్ ఆఫీసు ఎదుట కోవాలక్ష్మీ, బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించి ఆందోళనకు దిగారు.

Advertisement

Next Story

Most Viewed