ఆదానీ కుంభకోణంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. రాజ్​భవన్‌ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్

by Vinod kumar |   ( Updated:2023-03-12 14:36:46.0  )
ఆదానీ కుంభకోణంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. రాజ్​భవన్‌ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదానీ కుంభకోణంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్​పార్టీ ప్రణాళికను సిద్ధం చేసింది.ఈ నెల 15న రాజ్​భవన్‌ను ముట్టడించాలని ప్లాన్​చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మివేతపై నిలదీయనున్నారు. ఈ మేరకు కార్యకర్తలంతా తరలిరావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో​ పిలుపు ఇచ్చారు. ఆదానీ షేర్ల కుంభకోణం, ఎల్ఐసీ,ఎస్​బీఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల బాట పట్టడం వంటి వాటిపై ప్రజలకు వివరించేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కార్యాలయాలు కూడా ముట్టడించేందుకు కాంగ్రెస్​ప్రణాళికలు సిద్ధం చేసింది.

Advertisement

Next Story