Promotions: నాయబ్ తహసీల్దార్లకు.. తహసీల్దార్లుగా ప్రమోషన్లు: హర్షం వ్యక్తం చేసిన ‘ట్రెసా’

by Shiva |   ( Updated:2024-08-29 16:31:52.0  )
Promotions: నాయబ్ తహసీల్దార్లకు.. తహసీల్దార్లుగా ప్రమోషన్లు: హర్షం వ్యక్తం చేసిన ‘ట్రెసా’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న 83 మంది నాయబ్ తహసీల్దార్లను తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పించే ప్రతిపాదనకు శాఖా పదోన్నతుల కమిటీ (డీపీసీ) ఆమోదం తెలిపింది. ఇందులో మల్టీజోన్-1లో 40 మంది, మల్టీజోన్-2లో 43 మంది తహసీల్దార్లుగా పదోన్నతులు పొందారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీ‌ఎల్ఏ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో డీపీసీ సమావేశం జరిగింది. అయితే, పదోన్నతులపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే.గౌతమ్ కుమార్, రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీసీఎల్ఏ కార్యదర్శి నవీన్ మిట్టల్‌‌కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొత్త జోనల్ సిస్టమ్ రాక ముందు సీనియర్ అసిస్టెంట్ నుంచి నాయబ్ తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన వారు పాత జోనల్ సిస్టమ్ ప్రకారం వారి సీనియర్ అసిస్టెంట్ సీనియారిటీని పరిగణలోకి తీసుకుని తహసీల్దార్ల పదోన్నతులు కల్పించాలని కోరారు. లేని పక్షంలో చాలా‌మంది సీనియర్లు పదోన్నతులు కోల్పోతారని వారికి న్యాయం చేయాలని ‘ట్రెసా’ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed