TSPSC పేపర్ లీకేజీ ఇష్యూపై ప్రొఫెసర్ హరగోపాల్ అసహనం

by GSrikanth |   ( Updated:2023-04-03 05:35:24.0  )
TSPSC పేపర్ లీకేజీ ఇష్యూపై ప్రొఫెసర్ హరగోపాల్ అసహనం
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్‌పీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారం మూలంగా నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులు పక్కకు పెడితే.. ప్రభుత్వ, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. లీకేజీ ఇష్యూలో మంత్రి కేటీఆర్ హస్తం ఉందంటూ కాంగ్రెస్, బీజేపీ చీఫ్‌లు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఆరోపించగా.. వారి ఆరోపణలకు స్పందించిన కేటీఆర్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఇప్పుడీ అంశం కాస్త అధికార, విపక్ష నేతలకు మధ్య రాజకీయ యుద్ధానికి కారణమైంది. తాజాగా.. ఈ వ్యవహారంపై ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. ఉన్నత విద్యా వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై రాజకీయ జోక్యం లేకుండా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి కల్పించే వ్యవస్థ ఉండాలి.. అందుకోసం ఉద్యోగ హక్కు చట్టం చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed