HYD: జైలు నుంచి దర్జాగా విడుదలైన ఖైదీ.. అసలు విషయం తెలిసి షాకైన పోలీసులు

by Gantepaka Srikanth |
HYD: జైలు నుంచి దర్జాగా విడుదలైన ఖైదీ.. అసలు విషయం తెలిసి షాకైన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నకిలీ పత్రాలు సృష్టించి ఓ ఖైదీ జైలు నుంచి దర్జాగా విడుదల అయ్యారు. వివరాల్లోకి వెళితే.. భూ కబ్జా, మోసం కేసుల్లో హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సుజాతలి ఖాన్‌(Sujathali Khan)ను నవంబర్ 2వ తేదీన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు(Narsinghi Police) అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచి చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించారు. నకిలీ బెయిల్‌తో ఈనెల 26వ తేదీన జైలు నుంచి బయటకు వచ్చారు. అతనికి అండర్ ట్రయలర్ ఖైదీ(Under trial prisoner) సహకారం అందించారు.

అయితే, సుజాతలి బెయిల్‌కు సంబంధించిన పత్రాలు ఆన్‌లైన్‌లో రాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా.. నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు. పాత బెయిల్ పత్రాలను ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఇప్పటికే సంతోష్ నగర్ హెచ్ఐజీ కాలనీకి చెందిన మీర్ సుజాద్ అలీఖాన్‌పై చీటింగ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed