Narendra Modi : పాలమూరుకు ప్రధాని.. ముహూర్తం ఫిక్స్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-23 05:36:56.0  )
Narendra Modi : పాలమూరుకు ప్రధాని.. ముహూర్తం ఫిక్స్!
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ రెండవ తేదీన పాలమూరు జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలకు సమాచారం అందింది. ఎన్నికలు సమీపిస్తుండడం, ప్రధానమంత్రి పాలమూరు నుండి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి పాలమూరుకు రాక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. పాలమూరు జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహించే విధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా శనివారం పాలమూరు జిల్లా కేంద్రంలో ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య నేతలు హాజరై ప్రధాని రాక.. సభా నిర్వహణ ఏర్పాట్లపై సలహాలు సూచనలు చేయనున్నారు.

Advertisement

Next Story