- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Narendra Modi: వయనాడ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రకృతి విపత్తు కారణంగా అతలాకుతలం అయిన కేరళలోని వయనాడ్ లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. కొండచరియలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్ మల తదితర ప్రాంతాల్లో మోడీ శనివారం ఎయిరియల్ సర్వే నిర్వహించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కు చేరుకున్న మోడీకి అక్కడ కేరళ గేవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ స్వాగతం పలికారు. అనంతంరం వీరుతో పాటు కేంద్ర మంత్రి సురేశ్ గోపీతో కలిసి ప్రధాని ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ లో వయనాడ్ వెళ్లారు. అక్కడ కొండచరియలు విరిగిపడిన గ్రామాలు విధ్వంసమైన ప్రాంతంలో పీఎం మోడీ ఏరియల్ సర్వే చేశారు. అనంతరం కాల్ పెట్టలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ టీమ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు. అలాగే సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.