- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్! ఆ రోజే ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన?
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ‘సంకల్ప పత్ర’ పేరుతో పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యంగా బీజేపీ తెలంగాణపై మరింత ఫోకస్ పెంచినట్లు కన్పిస్తుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ మరోసారి తెలంగాణ పర్యాటనకు రానున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 3 వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల తెలిపాయి. ఇక, ఈ నెల 18వ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటన, విశ్రాంత ఆర్మీ అధికారులతో సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
మరోవైపు ఈ నెల 18వ తేదీన సాయంత్రం 4గంటలకు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు. 19వ తేదీన ఖమ్మంలో పర్యటన చేయనున్నారు. కాగా, ఈ నెల 18వ తేదీన మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే.