- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కవితకు బెయిల్ కోసం కొండగట్టులో మొక్కులు
దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ కస్టడీలో ఉన్న కవిత బెయిల్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. ఆమె బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల వేళ కవిత జైల్లో ఉండటం పట్ల ఆమె అభిమానులు, అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో కవితకు బెయిల్ రావాలని కవిత అనుచరులు బోధన్ కు చెందిన శేఖర్, శంకర్ లు తాజాగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 116 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసులో దాఖలైన బెయిల్ పిటిషన్ పై మే 2న, ఈడీ కేసులో దాఖలైన బెయిల్ పిటిషన్ పై మే 6న తీర్పు వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. మరోవైపు కవితకు మే7 వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.