- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొల్లూరులో ప్రీమియం విల్లాస్.. మాజీ మంత్రి ప్రీలాంచ్ ఆఫర్!
దిశ, తెలంగాణ బ్యూరో: సాహితీ, జయ, ఫార్చూన్ 99 హోమ్స్, ఏవీ ఇన్ఫ్రాకాన్, భువనతేజ, ఆర్ జే గ్రూప్, ప్రెస్టేజ్.. ఇలా అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు వివిధ రూపాల్లో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొన్నేమో ప్రీలాంచ్ ఆఫర్ల కింద ముందే డబ్బులు వసూలు చేసి రూ.వందల కోట్లు కూడబెట్టుకుంటున్నాయి. అనుకున్న సమయానికి నిర్మాణాలే మొదలుపెట్టకుండా ఇతర ప్రాంతాల్లో ఆ సొమ్మును ఇన్వెస్ట్ చేస్తున్నాయి.
మరికొన్ని చోట్ల భూములు కొనుగోలు చేసి లాభాలార్జిస్తున్నాయి. ఆ తర్వాత కస్టమర్లను నిండా ముంచేస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేస్తే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. వారి స్థిరాస్తులను అమ్మేసి మోసపోయిన అమాయక జనానికి డబ్బులు తిరిగి ఇవ్వకుండా దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారు. ఐతే ఆయా సంస్థల వెనుక రాజకీయ నాయకులు ఉన్నారన్న మాట నిజం.
ఐతే కొందరు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులే రియల్ ఎస్టేట్ సంస్థలను నడిపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా బిల్డర్ల అవతారమెత్తారు. అది ప్రీలాంచ్ ఆఫర్ల కింద విల్లాలు అమ్మేస్తుండడం విస్మయానికి గురి చేస్తున్నది. హైదరాబాద్ వెస్ట్ కొల్లూరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ సంస్థ విల్లాలు నిర్మిస్తున్నామంటున్నది. 74 ఎకరాల్లో ప్రీలాంచ్ ఆఫర్స్ ప్రకటించింది.
ఎలాంటి హెచ్ఎండీఏ, రెరా అనుమతులు లేవు. కానీ అమ్మకాలు సాగిస్తున్నది. ఈ కంపెనీ గురించి ఆరా తీస్తే రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిసింది. ఇందులో మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులే ఉన్నారని తెలిసింది. సేల్స్ ప్రమోటర్స్ కూడా లక్ష్మారెడ్డి పేరునే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
అస్పైర్ స్పేసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ మాజీ మంత్రి చెర్లకోల లక్ష్మారెడ్డి, ఆయన కుమారుడు, బంధువుల భాగస్వామ్యంతో నడుస్తున్నది. సంస్థకు డైరెక్టర్లుగా వెంకట తూమాటి నర్సింహారెడ్డి, శ్వేత చెర్లకోల తదితరులు ఉన్నారు. ఈ సంస్థ చేపట్టినట్లుగా చెప్తున్న ప్రీమియం విల్లాలను గతేడాది జూన్ నుంచే ప్రీలాంచ్ పేరిట అమ్మేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణమే మొదలుకాలేదు.
అనుమతులకు దరఖాస్తు చేసుకోలేదు. ఇంకా ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ కాలేదని సమాచారం. ఇప్పటికే 50 కి పైగా విల్లాలను ప్రీలాంచ్ కింద విక్రయించినట్లు సేల్స్ ఏజెంట్లు, మేనేజర్లు చెప్తుండడం విశేషం. తెర వెనుక మాజీ మంత్రి ఉండడంతో కస్టమర్లు కూడా నమ్మేస్తున్నారు. ఈ అక్రమాలను అరికట్టాల్సిన ప్రజాప్రతినిధులే ఈ దందాకు తెర తీయడంతో మిగతా సంస్థలు యధేచ్చగా సాగిస్తున్నాయి.
ఇది తగునా?
సాహితీ వంటి సంస్థలు వేలాది మంది కస్టమర్లను నిండా ముంచాయి. రోడ్డెక్కి న్యాయం చేయండంటూ గగ్గోలు పెడుతున్నారు. వారికి న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ దందాను ప్రోత్సహిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ప్రాజెక్టు గురించి వివరాలను 'దిశ' ఆ సంస్థ సేల్స్ మేనేజర్ ప్రసాద్ ప్రీలాంచ్ వివరాలను వివరించారు.
కొల్లూరులో 74 ఎకరాల్లో చేపట్టిన ప్రాజెక్టు. ఐతే ముందుగా 40 ఎకరాల్లో 366 విల్లాలను నిర్మిస్తున్నాం. గతేడాది జూన్ నుంచి స్టార్ట్ చేశాం. అప్పట్లో చ.అ. ధర రూ.6 వేలుగా పెట్టాం. ఇప్పుడైతే అది రూ.6800లుగా ఉంది. ఇదంతా 100 శాతం పేమెంట్ చేస్తేనే ఉంటుంది. 50:50 ఆప్షన్ కూడా ఉన్నది. మూడు, నాలుగు రకాలుగా కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే మేం 48 విల్లాలను అమ్మేశాం. ల్యాండ్ అక్వాయిరింగ్ పూర్తయ్యింది.
మార్చి నెల నుంచి పని మొదలవుతుంది. 2025 ఆగస్టుకు విల్లాస్ హ్యాండోవర్ చేస్తాం. మార్చి నుంచి చ.అ. ధర రూ.8500లకు పెరుగుతుంది. స్పేస్ విజన్ వెంఛర్స్ ఎండీ నర్సింహారెడ్డి, ఇందులో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఆయన కొడుకు వాటాలు కూడా ఉన్నాయి. భవ్యాస్ కన్స్ట్రక్షన్ వాళ్లు విల్లాస్ నిర్మిస్తున్నారంటూ పూర్తి వివరాలను వెల్లడించారు.
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ఉన్నారా? అని మళ్లీ అడిగినా అవునని స్పష్టం చేశారు. మాజీ మంత్రి పేరు చెప్పడం ద్వారా కస్టమర్లను దగా చేస్తున్నారు. ఈజీగా బుట్టలో వేసుకునేందుకు ఉపయోగపడుతుంది. పైగా సదరు కంపెనీలో లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు ఉండడం విశేషం.
ఈ విశిష్టతలతో ప్రచారం
- ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 కి దగ్గరే కొల్లూరులో ప్రీమియం విల్లాస్ ఎక్సలెంట్ ప్రీలాంచ్ ఇన్వెస్ట్మెంట్ అవకాశం. 200 ఫీట్ల రోడ్డు నుంచి లోపలికి వెళ్లే దారి ఉంది.
- 20 ఏండ్లకు పైగా అనుభవం కలిగిన రియల్ ఎస్టేట్ సంస్థ. మియాపూర్ దగ్గర 10 ఎకరాల్లో హై రైజ్ అపార్టుమెంట్ నిర్మిస్తున్నది. శిల్పారామం దగ్గర 50 వేల చ.అ.ల విస్తీర్ణంతో కమర్షియల్ బిల్డింగ్ కూడా నిర్మిస్తున్నది.
- 74 ఎకరాల్లో 588 విల్లాస్. రెండున్నరేండ్లల్లో హ్యాండోవర్ చేస్తామంటున్నారు. జి ప్లస్ 2 , క్లబ్ హౌజ్, ఎన్నెన్నో సదుపాయాలు కల్పిస్తున్నామంటున్నారు.
విల్లాలు వివరాలు.
267 Sq.Yds - 3580sft
317 Sq.Yds - 4342 sft
357 Sq.Yds - 4900 sft
440 Sq.Yds - 6100 sft
ఆఫర్లు ఇలా..
- మొదటి 50 బుకింగ్స్ కి మాత్రమే. ఒక్కో విల్లా రూ.2.40 కోట్లు. ఇది కరెంట్ మార్కెట్ లో 3.20 కోట్లుగా ఉన్నది. రెండేండ్లల్లో అది రూ.6 కోట్లకు చేరుతుంది.
- 30 రోజుల్లో 100% పేమెంట్ చెల్లిస్తేనే చ.అ. ధర రూ.6800ల ఆఫర్ ఉంటుంది. మార్చి నుంచి రూ.8 వేలకు చేరుతుంది.
- ప్రాజెక్టుకు చెంతనే అపర్ణ, రాజపుష్ప, మై హోం వంటి సంస్థలకు 1000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్నది.
- కొల్లూరు సెజ్, కొకాపేట సెజ్, నియోపాలిస్, తెల్లాపూర్ టెక్నోసిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, విప్రో సెజ్ వంటివన్నీ దగ్గరే ఉన్నాయి.
దరఖాస్తు చేయలే
కొల్లూరులో అస్పైర్ స్పేసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ చేపట్టిన ఈ ప్రీమియం విల్లాస్ ప్రాజెక్టుకు అతీగతీ లేదు. గతేడాది జూన్ లో మొదలుపెట్టినా ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు. కానీ ప్రపోజ్డ్ హౌజింగ్ లే అవుట్ అంటూ అస్పైర్ స్పేసెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ బ్రోచర్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ప్రపోజ్డ్ రెసిడెన్షియల్ విల్లాస్ అంటూ భవ్యాస్ కన్స్ట్రక్షన్ బ్రోచర్లను రూపొందించింది. ఐతే హెచ్ఎండీఏకి దరఖాస్తు కూడా సమర్పించలేదు.
కానీ మార్చి నెలలో అనుమతులు వచ్చేస్తాయని మార్కెటింగ్ మేనేజర్ చెప్తున్నారు. ఒక వేళ అనుమతులే రాకపోతే కస్టమర్లకు ఏం చెప్తారు? జాప్యం జరిగితే ప్రశ్నిస్తే స్థాయి కస్టమర్లకు ఉంటుందా? పైగా రాజకీయ నేతల భాగస్వామ్యంతో నడిచే ఈ సంస్థపై పోరాటం చేసే శక్తి ఉంటుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారే ప్రీలాంచ్ ఆఫర్లతో వ్యాపారం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.