Medico Preethi Death:ప్రీతిని సైఫే ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడు: ప్రీతి తండ్రి సంచలన ఆరోపణలు

by Satheesh |   ( Updated:2023-02-27 05:02:34.0  )
Medico Preethi Death:ప్రీతిని సైఫే ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడు: ప్రీతి తండ్రి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: మెడికో ప్రీతి తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు ప్రీతిని సైఫే చంపేశాడని ఆయన ఆరోపించారు. సీనియర్ సైఫే విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి ప్రీతిని హత్య చేశాడని అన్నారు. తన కూతురు చావుకు కారణమైన నిందితుడి సైఫ్‌ను కఠినంగా శిక్షంచాలని డిమాండ్ చేశారు. ప్రీతి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని.. నిందితుడు సైఫ్‌ను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రీట్ మెంట్ పేరుతో తమను మభ్యపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెండ్ ప్రీతి సీనియర్ సైఫ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.

పాయిజన్ ఇంజక్షన్ తీసుకున్న ప్రీతి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గత ఐదురోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. ప్రీతి మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి.. అనంతరం మృతురాలి డెడ్ బాడీని స్వగ్రామానికి తరలించారు. ప్రీతి స్వస్థలం అయిన జనగామ జిల్లా మొండ్రాయిలోని గిర్నీ తండాలో ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రీతి మృతితో గిర్నీ తండాలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. ఇక, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed