ఇదేం వాడకం రా బాబు.. ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ (వీడియో)

by GSrikanth |
ఇదేం వాడకం రా బాబు.. ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో పెళ్లికంటే ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్‌గా మారింది. కాబోయే దంపతులు జీవితంలో గుర్తుండిపోయేలా సినిమాల్లో మాదిరిగా అద్భుతమైన లొకేషన్లలో ఫొటోలు, వీడియోలతో ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వారు ఎంచుకుంటున్న లొకేషన్లు చర్చగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ఓ కాబోయే జంట ప్రీ వెడ్డింగ్ షూట్ జరపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్టీసీ బస్సులో ఫొటోషూట్ చేయడం పట్ల కొందరు నెటిజన్లు భిన్నరకాలుగా రియాక్ట్ అవుతున్నాయి. ఇటువంటి వీడియో షూట్‌ల వల్ల రోడ్డు భద్రతకు ఆటంకం కలగడంతో పాటు, క్రమశిక్షణ సమస్య ఉత్పన్నం అవుతుందని కొందరు నెటిజన్లు మండిపడుతుంటే నగరంలో ఉన్న మిలియన్ ట్రాఫిక్ సమస్యల్లో ఇదో సమస్యే కాదు దీంతో ఎవరికి ఇబ్బంది లేదని దీనిని అనవసరంగా వివాదం చేయవద్దని మరి కొందరు కామెంట్స్ చేస్తూ కాబోయే కపుల్స్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story