- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prashant Kishor: పీకే 9-7-1 ఫార్మూలా... ఆ మూడు పార్టీలు కలిసేనా?
Prashant Kishor
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ప్రచారం కాకపుట్టిస్తోంది. పార్టీలోకి ఆయన రాకపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం హస్తం పార్టీలో అలజడిని రేపింది. ఈ క్రమంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. టీఆర్ఎస్ కు పీకే టీమ్ పని చేస్తుందన్న వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ఎవరితో పొత్తులుండవని రాహుల్ చెప్పారని, త్వరలో జరగబోయే వరంగల్ సభలోనూ ఇదే విషయాన్ని చెప్పబోతున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకోవడానికే పీకే ఆదివారం సీఎం కేసీఆర్ తో భేటీ అయినట్లు రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ ఓ వైపు ఏఐసీసీ నేతలతో కీలక చర్చల్లో ఉంటూనే మరో వైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమాలోచనలు చేయడం కాంగ్రెస్ శ్రేణులను అయోమయంలో పడేసినట్లైంది.
యువనేతల అభ్యంతరం
ఇన్నాళ్లు ఆయా పార్టీలకు వ్యూహకర్తగా పని చేసిన ఐప్యాక్ సారథి ప్రశాంత్ కిషోర్ తీరుపై కాంగ్రెస్ లో కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పీకే తమ పార్టీకోసం పని చేస్తారని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ స్వయంగా మీడియాకు వివరించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు వివిధ పార్టీలతో కలిసి పని చేసిన వ్యక్తిని నమ్మడం సరికాదనే అభిప్రాయం కొంత మంది యువనేతల నుండి వ్యక్తం అవుతోంది. పార్టీకి చెందిన కీలకమైన సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన యువ నేతల్లో కనిపిస్తోందట.
గందరగోళంలో సీనియర్లు
ఈ వ్యవహారంపై సీనియర్లలోనూ గందరగోళమే కనిపిస్తోంది. ఇప్పటి వరకు స్పందించిన సీనియర్లు సైతం తలోమాట మాట్లాడుతుండటంతో కింది స్థాయి నేతలను మరింత కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది. ఈ అంశంపై ఎలాంటి తొందరపాటు వ్యాఖ్యలు చేయొద్దని, అధిష్టానమే చూసుకుంటుందని రాష్ట్ర నేతలకు ఏఐసీసీ కీలక నేత ఒకరు మార్గదర్శకం చేసినట్లు టాక్ నడుస్తోంది. పీకే ఎపిసోడ్ లో కొంత వరకు స్పందించిన వీహెచ్, జగ్గారెడ్డి లాంటి సీనియర్లు ఈ అంశంలో అధిష్టానందే ఫైనల్ అన్నట్లుగా మాట్లాడారు. తాజాగా ఐప్యాక్ తో టీఆర్ఎస్ ఒప్పందం చేసుకుందనే వార్తలు కాంగ్రెస్ కు మైనస్ గా మారే అవకాశాలు ఉన్నాయనే వాదన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్లు టీఆర్ఎస్ తో పోరాటం చేసి తీరా ఇప్పుడు పొత్తు అంటే క్షేత్ర స్థాయిలో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళనలు హస్తం నేతల్లో మొదలవుతున్నాయి. ఈ పరిణామాలు తిరిగి బీజేపీకి అనుకూలంగా మారితే మొదటికే ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉందనే అభిప్రాయం సీనియర్ల నుండి వ్యక్తం అవుతోంది.
కుదిరిన డీల్?
స్టేట్ పొలిటికల్ సినారియోలో పీకే మార్క్ సైక్లోన్ గా మారబోయే అవకాశాలు ఉన్నాయి. ఓవైపు టీఆర్ఎస్, మరో వైపు కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటున్న పీకే మనసులో ఏముందో ఎవరికి అంతుచిక్కడం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కు ప్రధాన శత్రువు బీజేపీ. ఈ కారణం చేత రాష్ట్ర స్థాయిలో ఈ రెండు పార్టీలు విబేధించుకున్నా జాతీయ స్థాయిలో మాత్రం ఒప్పందం కుదిరినట్లు పొలిటికల్ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. 9-7-1 ఫార్మూలాతో డీల్ కుదిరినట్లు టాక్ నడుస్తోంది. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకునెలా వ్యూహం రచించినట్లు అందులో భాగంగా ఉమ్మడిగా 9 లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్, 7 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో ఎంఐఎం పోటీ చేయాలని పీకే సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఈక్వేషన్ లో నిజమెంత అనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉన్నా తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం కల్లోలం మొదలైంది. ప్రస్తుతం ఏర్పడిన ఈ కన్ప్యూజన్ కు తెరపడాలంటే మాత్రం ఏఐసీసీ పెద్దలే స్వయంగా స్పందిచాల్సి ఉంది.
- Tags
- Prashant Kishor