- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జీహెచ్ఎంసీలో ప్రజావాణి ప్రారంభం.. ప్రజల సమస్యలు వింటున్న ఇంచార్జి కమిషనర్ ఆమ్రపాలి..
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం అయ్యింది. ఈ క్రమంలోనే ఇవాళ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా ప్రజావాణి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటీవల కోడ్ ముగియడంతో తిరిగి స్టార్ట్ అయింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణికి జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ఆమ్రపాలి, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ ఇతర అధికారులు హజరయ్యారు.
హెడ్ ఆఫీస్‌తో పాటు ఆరు జోన్లుగా ఇతర 30 సర్కిల్ కార్యాలయాల్లోనూ ఇవాళ్టి నుంచి ప్రజావాణి కార్యక్రమం నడుస్తోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే వారు ప్రజల ఆర్జీలను స్వీకరిస్తున్నారు. కాగా, ఇటీవల ప్రజాభవన్‌లో ప్రజావాణి ప్రొగ్రాం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. దాదాపు మూడున్నర నెలల తర్వాత ప్రజావాణి తిరిగి ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆర్జీలు ఇవ్వడానికి వస్తున్నారు.