- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: రేపు ప్రజాపాలన వెబ్సైట్ ప్రారంభం
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ శుభవార్త చెప్పారు. రేపు ప్రజాపాలన వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం www.prajapalana.telangana.gov.in వెబ్సైట్ను లాంఛ్ చేయనున్నట్లు సీఎస్ ప్రకటించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రోగ్రామ్లో ప్రజల నుంచి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. ఇందులో ‘అభయహస్తం’ పేరుతో ఐదు గ్యారంటీల కోసం వచ్చిన అప్లికేషన్లు 1,05,91,636 కాగా రేషను కార్డు, ధరణి తదితరాల కోసం అదనంగా మరో 19,92,747 అప్లికేషన్లు వచ్చాయి.
మొత్తం 8 పని రోజుల్లో రాష్ట్రలోని మతొతం 12,769 గ్రామపంచాయతీల్లో, 3,623 మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించి అప్లికేషన్లను తీసుకున్నట్లు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. వీటన్నింటి పరిధిలోని మొత్త, 1,11,46,293 కుటుంబాల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. చివరి రోజైన శనివారం మొత్తం 16,90,278 దరఖాస్తులు వస్తే అందులో ఐదు గ్యారంటీలకు సంబంధించినవి 12,53,235 ఉన్నాయని వివరించారు.