- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: రేషన్ కార్డు కోసం ఎదురు చూసే వారికి సీఎం గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 17 నుంచి..
దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిచబోతున్నట్లు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం. సెప్టెంబర్ లో 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నామని ఇందు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నట్లు వివరించారు. కాగా రేషన్ కార్డులు ఆర్యోగ్య శ్రీ కార్డులను వేరు వేరుగా అందిచాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులకు అర్హులను గుర్తించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేషన్ కార్డులకు హెల్త్ కార్డుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఉస్మానియా హాస్పిటల్ ను గోషామహల్ కు తరలిస్తాం: సీఎం
ఉస్మానియా హాస్పిటల్ ను గోషామహల్ కు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. గోషామహల్ లో నిర్మించాలని తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్స్ తో డిజైన్ లను రూపొందించాలని, వచ్చే యాభై ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్ లు సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలన్నారు. కాగా ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీసు మైదానంలో భవనం నిర్మించనున్నట్లు ఈనెల మొదటి వారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే సభలో సీఎం ప్రకటన చేశారు.