Bahubali kaja : సీఎం రేవంత్‌కి బాహుబలి కాజా గిఫ్ట్.. హీరో ప్రభాస్ పెద్దమ్మ ఇచ్చిన ఫేమస్ స్వీట్

by Ramesh N |   ( Updated:2024-08-19 15:23:25.0  )
Bahubali kaja : సీఎం రేవంత్‌కి బాహుబలి కాజా గిఫ్ట్.. హీరో ప్రభాస్ పెద్దమ్మ ఇచ్చిన ఫేమస్ స్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి‌కి అభినందన సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో తాపేశ్వరం సురుచి బాహుబలి కాజాను దివంగత సినీ నటుడు కృష్ణంరాజు భార్య, హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వీట్ అందజేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన ఫోటో తాజాగా నెట్టింట వైరల్ అయింది.

అయితే, తర్వాత తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ సభలో ప్రబాస్‌పై రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించడం కూడా తాజాగా వైరల్‌గా అయింది. క్షత్రియ సామాజిక వర్గానికే చెందిన ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని సీఎం ప్రశంసించారు. హాలీవుడ్ రేంజ్ సినిమా బహుబలిని ప్రభాస్ లేకుండా ఊహించలేమని ఆయన సభలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా దివంగత సినీ నటుడు కృష్ణం రాజు తో ఉన్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

Read More..

Nirmal Girl Durga : చిన్నారి దుర్గకు సీఎం రేవంత్ రెడ్డి బాసట.. కలెక్టర్‌కు కీలక అదేశాలు

Advertisement

Next Story