Power Discoms: రాష్ట్ర డిస్కంలపై రూ.261 కోట్ల భారం.. కేసీఆర్ నిర్ణయాలతో ఊహించని విపత్తు

by Shiva |
Power Discoms: రాష్ట్ర డిస్కంలపై రూ.261 కోట్ల భారం.. కేసీఆర్ నిర్ణయాలతో ఊహించని విపత్తు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని డిస్కంలకు ఊహించని విపత్తు ఎదురైంది. పవర్ ఎక్ఛేంజ్ నుంచి కరెంటు కొనుగోలు చేయడానికి తెలంగాణ డిస్కంలకు నిషేధాజ్ఞలు వచ్చాయి. సకాలంలో సీఎం రేవంత్ జోక్యం చేసుకోవడంతో రాష్ట్రం అంధకారంలోకి పోకుండా జాగ్రత్త పడినట్లయింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆదేశాలతో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ తెలంగాణ డిస్కంలపై విధించిన ఆంక్షలతో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ వెంటనే అధికారులకు దిశానిర్దేశం చేయడంతో కోర్టు ద్వారా రిలీఫ్ లభించినట్లయింది. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యమేమీ లేకపోయినా గత ప్రభుత్వ తప్పిదంతో ఇప్పుడు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించినా శాశ్వత పరిష్కారం కనుగొనడం కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పడింది.

12 ఏళ్ల కాలానికి ఒప్పందం

ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్‌ను తీసుకునేందుకు గత ప్రభుత్వం పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో విద్యుత్తు సరఫరా చేసే కారిడార్‌ను బుక్ చేసుకున్నదని, కేవలం 1000 మెగావాట్ల కారిడార్ సరిపోతున్నప్పటికీ అవసరం లేకపోయినా అదనంగా మరో 1000 మెగావాట్ల సరఫరాకు అడ్వాన్సుగానే ఎక్కువ కెపాసిటీ కలిగిన (2000 మెగావాట్ల) కారిడార్‌ను బుక్ చేసుకున్నట్లుగా విద్యుత్ అధికారులు తెలిపారు. తెలంగాణ డిస్కంలు ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌తో మార్వా థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు 2015 సెప్టెంబర్ 22న 12 ఏళ్ల కాలానికి గాను బ్యాక్-టూ-బ్యాక్ లాంగ్ టర్మ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. పవర్ గ్రిడ్‌తో 2000 మెగావాట్ల సామర్థ్యం ఉండే కారిడార్‌ను 25 ఏళ్లు పాటు వాడుకునేలా దరఖాస్తు చేసుకుని ఒప్పందాన్ని తెలంగాణ డిస్కంలు కుదుర్చుకున్నాయి.

పవర్ గ్రిడ్‌కు డిస్కంల రిక్వెస్ట్

చత్తీస్‌గఢ్ నుంచి ఆశించిన (2000 మెగావాట్లు) విద్యుత్తు రాకపోవటంతో డిస్కంలు కారిడార్ విషయంలోనూ వెనుకడుగు వేశాయి. కేవలం 1000 మెగావాట్లకు సంబంధించిన పీపీఏ (పవర్ పర్చేస్ అగ్రిమెంట్)పై మాత్రమే పవర్ గ్రిడ్‌తో తెలంగాణ డిస్కంలు సంతకం చేయాలనుకున్నాయి. కానీ పవర్ గ్రిడ్ మొత్తం 2000 మెగావాట్ల ఒప్పందంపై సంతకం చేయాలని పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సంతకాలు చేయాల్సి వచ్చిందని డిస్కంలు వ్యాఖ్యానించాయి. ఒప్పందం ప్రకారం వెయ్యి మెగావాట్లు 2017 ఏప్రిల్ 1 నుంచి అమలు కావా ల్సి ఉండగా మిగిలిన 1000 మెగావాట్లు 2018 నవంబర్ నుంచి అందుబాటులోకి రావాల్సి ఉన్నది. కానీ ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తుందనుకున్న విద్యుత్తు రావటం లేదని, అదనంగా తీసుకున్న 1000 మెగావాట్ల కారిడార్‌ను మినహాయించాలంటూ పవర్ గ్రిడ్‌ను డిస్కంలు రిక్వెస్టు చేశాయి.

రూ.261 కోట్లు చెల్లించాలని హుకుం

పవర్ గ్రిడ్ దీనికి అంగీకరించకపోగా ప్రత్యేకంగా తెలంగాణ డిస్కంల కోసం మాత్రమే ఈ కారిడా ర్‌ను కేటాయించి ఇతర రాష్ట్రాలకు ఇవ్వలేదనే కార ణాన్ని చూపి ఇప్పుడు అర్ధాంతరంగా వెనక్కి తగ్గుతు న్నందున రిలెంక్విష్‌మెంట్ ఛార్జీలుగా రూ.261 కో ట్లు చెల్లించాలని స్పష్టం చేసింది. తెలంగాణ డిస్కం లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులరేటరీ కమిష న్‌ను ఆశ్రయించాయి. అక్కడ ఇంకా విచారణ కొనసాగుతూ ఉన్నది. కారిడార్‌కు సంబంధించి చెల్లించాల్సిన రూ.261 కోట్లు బకాయిగా ఉన్నదంటూ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. తెలంగాణను డిఫాల్టర్ జా బితాలో చేరుస్తూ ‘ప్రాప్తి’ పోర్టల్‌లో ప్రకటించింది. పవర్ గ్రిడ్ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కం లు విద్యుత్తు బిడ్లలో పాల్గొనకుండా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నిషేధాజ్ఞలు విధించింది. బకాయి లు ఇచ్చేంత వరకూ పవర్ ఎక్షేంజీల నుంచి విద్యు త్తు కొనుగోళ్లు ఆపాలని నిర్ణయం తీసుకుంది.

హైకోర్టును ఆశ్రయించిన డిస్కంలు

గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలోని విద్యుత్తు సం స్థలకు భారీ షాక్ తగిలిందని, రాష్ట్రమంతటా వి ద్యుత్తు సరఫరా నిలిచిపోయే ప్రమాదం నెలకొన్నదని, ముఖ్యమంత్రి మార్గనిర్దేశత్వంలో డిస్కం అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో అంధకారం చోటుచేసుకోకుండా పెను విపత్తు తృటిలో తప్పినట్లయిందన్నది ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు సరఫరా కోసం ఏడేండ్ల క్రితం పవర్ గ్రిడ్‌ కార్పొరేషన్‌తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న కారిడార్ ఒప్పందం గాలివానగా మారింది. సకాలంలో సీఎం స్పందించి సరైన తీరులో డ్రైవ్ చేసిన కారణంగానే పవర్ గ్రిడ్ పెట్టిన ఆంక్షలకు కోర్టు ద్వారా రిలీఫ్ లభించిందని, ఆ గైడెన్సు లేనట్లయితే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయేదని వ్యాఖ్యానించారు.

ముందుచూపుతో తప్పిన కరెంట్ ముప్పు

ఈ ఆంక్షల కారణంగా గురువారం ఉదయం నుంచి పవర్ ఎక్ఛేంజీలు తెలంగాణ డిస్కంలను విద్యుత్తు కొనుగోలుకు బిడ్లలో పార్టిసిపేట్ కాకుండా అడ్డుకున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యుత్తు శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి విద్యుత్తు సరఫరాకు అంతరాయం రాకుండా చర్యలు చేపట్టాలని సూచించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఆ సూచనల మేరకు డిస్కం, ట్రాన్స్ కో అధికారులు హైకోర్టును ఆశ్రయించాయి. రీలెంక్విష్‌మెంట్ ఛార్జీల చెల్లింపు వ్యవహారం సెంట్రల్ ఈఆర్సీ విచారణలో ఉండగానే పవర్ గ్రిడ్ వ్యవహరించిన తీరును డిస్కం సరైంది కాదని ఆ పిటిషన్‌లో తెలంగాణ డిస్కం, ట్రాన్స్ కో అధికారులు పేర్కొన్నారు. తెలంగాణను డిఫాల్టర్‌గా ప్రకటించి, విద్యుత్తు కొనుగోళ్ల లావాదేవీల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించడం సహేతుకం కాదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు స్పష్టం చేశారు. ప్రాప్తి పోర్టల్‌లో పవర్ గ్రిడ్ నమోదు చేసినా బకాయిల చెల్లింపునకు 75 రోజుల పాటు గడువు ఉంటుందని, దీన్ని పక్కకు పెట్టి కరెంట్ కొనుగోళ్లపై ఆంక్షలు విధించటం సరైంది కాదని కోర్టుకు వివరించారు. కారిడార్ ఛార్జీలు, రిలెంక్విష్‌మెంట్ బకాయిల విషయంలో సెంట్రల్ ఈఆర్సీలో ఉన్న కేసు విచారణ పూర్తయ్యేంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ పవర్ గ్రిడ్‌కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నిషేధాజ్ఞలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed