పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలపై విద్యుత్ శాఖ ఫోకస్

by Gantepaka Srikanth |
పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలపై విద్యుత్ శాఖ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ రంగంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణంపై విద్యుత్ శాఖ అధికారులు దృష్టిసారిస్తున్నారు. హైదరాబాద్‌లోని జెక్కో కార్యాలయంలో సంస్థ సీఎండీ రోనాల్డ్ రోస్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. భూపాలపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారమే పనులు పూర్తవ్వాలని స్పష్టం చేశారు. అవసరమైన లేబర్లను సర్దుబాటు చేయాలని బీహెచ్ఈఎల్ అధికారులను కోరారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ స్టేజీ-1 పనులను ఈ ఏడాది అక్టోబర్ వరకు పూర్తిచేయాలని, స్టేజీ-2 పనులను వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్లను త్వరగా పూర్తిచేసేందుకు అవసరమైతే అత్యాధునిక టెక్నాలజీని వాడాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story