- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DAO పరీక్షను పోస్ట్‌పోన్ చేయండి: ప్రభుత్వానికి నిరుద్యోగుల డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పలు శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ బాధ్యతలను టీఎస్ పీఎస్సీకి అప్పగించింది. కాగా డివిజనల్ ఎకౌంట్ ఆఫీసర్(డీఏవో) 53 పోస్టులకు తొలుత నోటిఫికేషన్ ఇచ్చారు. కాగా దరఖాస్తు గడువు ముగిశాక మరో 28 ఖాళీలను అధికారులను గుర్తించారు. అయితే ఈనెల 26వ తేదీన తొలుత నోటిఫికేషన్ ఇచ్చిన 53 పోస్టులకు గాను టీఎస్ పీఎస్సీ పరీక్ష నిర్వహించనుంది. అదేరోజు ఐదు పరీక్షలు ఉండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదని, అందుకే డీఏవో పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎలాగూ అధికారులు మరో 28 ఖాళీలు గుర్తించారని, ఈ పరీక్షను వాయిదా వేసి అన్ని పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ వేయాలనే అభిప్రాయాన్ని నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఆ మిగిలిన 28 పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పట్లో ఉండదని, మళ్లీ ప్రభుత్వం ఎప్పుడు అప్లికేషన్ ఇస్తుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు. డీఏవో పరీక్షను వాయిదా వేస్తే లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేసినవారవుతారని టీఎస్ పీఎస్సీ అధికారులను కోరుతున్నారు.
Also Read..
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల వేళ బోర్డు కీలక నిర్ణయం