- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కవితకు మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ.. బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై పోస్టర్లు!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పోస్టర్ల వార్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇటీవల కేంద్రంపై వరుసగా ప్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిఇందే. ప్రధాని మోడీని రావణుడిగా, అమిత్ షా రాక సందర్భంగా పలు కేసుల్లో ఇన్ వాల్వ్ అయిన వారు బీజేపీ చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అయితే, తాజాగా బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబాన్నీ వదల్లేదు.
కవిత మేనేజ్ మెంట్ కోటాలో ఎమ్మెల్సీగా అయిందని, లిక్కర్‌లో వాటాలు అందుకుంటోందని పలు పోస్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక కేసీఆర్ పాస్ పోర్ట్ బ్రోకర్ అని, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ జోకరని, ఎమ్మెల్సీ కవిత క్వీన్ ఆఫ్ లిక్కర్ అని వైరలవుతున్నాయి. పేపర్ లీక్ అంశంపై సైతం పలు పోస్టర్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉండగా కల్వకుంట్ల అంటే కాళేశ్వరం స్కామ్, పాస్ పోర్ట్ స్కామ్, లిక్కర్, మన ఊరు మనబడి, మిడ్డే మీల్స్, కేసీఆర్ కిట్, డ్రగ్స్, ధరణి, టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ, పోడు ల్యాండ్, కోల్ స్కామ్ గా పోస్టర్‌లో పేర్కొన్నారు.